సౌతాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా జరిగిన 2వ వన్డేలో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ టీమిండియాకు పరాజయం తప్పలేదు. కోహ్లీ సెంచరీ చేసిన వన్డేల్లో భారత్ ఓడటం చాలా అరుదు. గతంలో ఇలా AUS చేతిలో 3, NZ 2, ENG, WI చేతిలో ఓ సారి భారత్ ఓడింది. చివరిసారిగా 2019లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా తాజాగా 8వ సారి రాయ్పూర్ వన్డేలో ఓటమి చవిచూసింది.