AP: సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ’50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 అందిస్తామన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఇలాంటివి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందుకు చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి’ అంటూ మండిపడ్డారు.