NLG: నార్కట్ పల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దూదిమెట్ల సత్తయ్య యాదవ్, వార్డు సభ్యులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి గుర్తు (వాలీబాల్) ను చూపిస్తూ ఓటును అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ.. ప్రచారాన్ని కొనసాగించారు.