ADB: నార్నూర్ గ్రామపంచాయతీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి అధిక మంది యువతనే పోటీకి దిగారు. కేంద్రంలో ఆస్పిరేషనల్ బ్లాక్ కింద ఎంపికైన నార్నూరును అభివృద్ధివైపు దూసుకెళ్లడమే లక్ష్యమంటూ ముందుకు వస్తున్నారు. ఇక ప్రజలు సైతం తమకు ప్రశ్నించే గొంతుక కావాలంటూ యువతకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.