GNTR: పొన్నూరు శివారులోని VNR ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ నెల 12వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ నాగ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, పరిసర గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.