SKLM: ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆముదాలవల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన కె. రేవంత్ (29) పట్టుబడ్డాడు. ఈ మేరకు బుధవారం 2nd క్లాస్ మెజిస్ట్రేట్ కె. శివరామకృష్ణ ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆయనకు అయిదు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని ట్రాఫిక్ సీఐ రామారావు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.