HNK: కాకతీయ యూనివర్సిటీ దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ VC ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మెన్ ముత్తినేని వీరయ్య, UGC సమన్వయకుడు మల్లికార్జున్, అనితా రెడ్డి హాజరవుతారన్నారు.