NLR: జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుపాలెంలో పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో జరిపిన ఈ దాడుల్లో 13మంది పేకాట రాయుళ్లు అరెస్టయ్యారు. వారివద్ద నుంచి 2 కార్లు, ఒక మోటర్ బైక్, రూ.రూ.50,435 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ముత్తుకూరు పోలీసులు తెలిపారు.