మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన MH370 మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ప్రయాణమైన బోయింగ్ 777 విమానం అనూహ్యంగా అదృశ్యమైంది. అయితే మరోసారి ఈ విమానం కోసం అన్వేషన ప్రారంభిస్తామని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది.