NLG: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు ప్రశాంత ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నార్కట్ పల్లి, యల్లారెడ్డి గూడెం గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కల్పించారు.