HYD: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే లాంగ్ స్ట్రెచ్ పనులు చివరిదాశకు చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు. అదనపు భవనాలు అందుబాటులోకి వస్తే, మరో 2 వేల పడకల సామర్థ్యం పెరుగుతుందని డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. దీని పై ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు.