కృష్ణా: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ను పెడన వైసీపీ ఇంచార్జ్ ఉప్పాల రాము, గూడూరు మండల వైసీపీ నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మండల స్థాయిలో పార్టీ కొనసాగించే కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలపరిచే చర్యలు తదితర అంశాలపై జగన్తో వారు చర్చించారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని జగన్ వారికి సూచించారు.