CTR: సోమలలోని ప్రాంతీయ పశు వైద్యశాలను పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించారు. పాలు ఇచ్చే దూడలను పుట్టించే విధానం, PMDS కార్యక్రమం, రైతులకు సబ్సిడీ ద్వారా అందే పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ చందన పాల్గొన్నారు.