NGKL: అమ్రాబాద్ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం సందర్శించారు. దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఆయన పేరిట అర్చన నిర్వహించి, ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.