MBNR: మిడ్జిల్ మండలంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత దోనూర్ క్లస్టర్‌ను ఎమ్మార్వో రాజు బుధవారం పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం నుంచి శనివారం సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉందని ఆయన అధికారులకు తెలిపారు. ఉపసంహరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.