AP: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదని అన్నారు. ‘పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ.. ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.