AP: జనవరి నాటికి అన్ని రోడ్లు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అధ్వానంగా మారాయని, అధికారంలోకి రాగానే బాగు చేశామన్నారు. వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో మళ్లీ బాగు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అనేక మార్పులు రాబోతున్నాయని, ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు.