నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ SVC కీలక ప్రకటన చేసింది. తమ ప్రాజెక్టుల గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో సినిమా చేయనున్నట్లు, దీన్ని దర్శకుడు అనీస్ బజ్మీ తెరకెక్కించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.