KDP: మైదుకూరులో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన TDP పార్టీ కార్యకర్త మార్తాల గురివి రెడ్డి కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా నగదును మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం అందజేశారు. మృతుని భార్య మార్తాల దేవికి ఈ చెక్కును అందజేశారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు.