TG: కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు 6 నెలలపాటు ప్రొబేషనరీ కాలం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వారి పనితీరుపై నివేదిక తీసుకుని దాని ప్రకారం ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీయాలో నిర్ణయించాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షిని రేవంత్ కోరారు. రాబోయే 6 నెలలు పరీక్షా కాలం అని, ఇందులో పాస్ అయితే 2028లో పాస్ అవుతామని మీనాక్షి వారికి సూచించారు.