W.G: జిల్లా కేంద్రం భీమవరంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. నిన్న ఎస్పీ నయీం అస్మితో కలిసి ట్రాఫిక్ అవరోధాలు, రోడ్డు ఆక్రమణ, సక్రమ పార్కింగ్, భద్రత లేని డ్రైవింగ్ తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, R&B అధికారులు పాల్గొన్నారు.