తెలంగాణ మలిదశ ఉద్యమానికి జ్వాలై రగిలిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి నేడు. ‘నా తెలంగాణ నాక్కావాలి’ అంటూ ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటికి నిప్పంటించుకుని, ఆ మంటల్లోనూ “జై తెలంగాణ” అని నినదించిన వీరుడు ఆయన. శ్రీకాంతాచారి బలిదానంతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే అది ఇలాంటి అమరుల త్యాగఫలమే. ఆ త్యాగధనుడికి ఘన నివాళి.