ASF: నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల చేసిన తనిఖీలలో నంబర్ ప్లేట్ లేని బైక్ను సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్లో వాహనం నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.