రీజినల్ రూరల్ బ్యాంకుల్లో RRBS 13,217 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ద్వారా అధికారిక వెబ్ సైట్లో లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.