NZB: బోధన్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ భాస్కరరావు పరిశీలించారు. సోమవారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రావడంతో పట్టణంలోని స్టోర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు కీలక సూచనలు చేశారు. స్టాక్ వివరాలు, రోజువారీ విక్రయాల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.