MHBD: కొత్తగూడ మండల పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఇవాళ BRS నాయకులు నోముల సాంబరాజు, గాడుదుల సమ్మయ్య, బొల్లు రాజేందర్ కాంగ్రెస్లో చేరారు. మండల అధ్యక్షులు సారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్సింగ్ పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వజ్జ సారయ్య పిలుపునిచ్చారు.