PDPL: ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ పట్టణంలో జరిగే CITU రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని CITU కార్యాలయంలో ఇవాళ జరిగిన ప్లంబర్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మహాసభలకు నేతలు బివి రాఘవులు, హేమలత, సాయిబాబు,పాల్గొన్నారు.