KMR: ఎల్లారెడ్డిలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ పోటాపోటీగా కొనసాగుతోంది. అయితే రేపటితో నామినేషన్ల ప్రకియ ముగియనుంది. ఈ మేరకు ఇవాళ రెండో రోజు ఏకాదశి కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకొచ్చారు. మొత్తంగా ఎల్లారెడ్డిలో రెండో రోజు 148 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు.