W.G: జిల్లా వ్యాప్తంగా 15,000 HIV, ఎయిడ్స్ పాజిటివ్ కేసులు ఉన్నాయని జిల్లా CSO గోపాల్ మీడియాకు తెలిపారు. సోమవారం భీమవరం ART సెంటర్ వద్ద ఆయన మాట్లాడుతూ.. HIV, ఎయిడ్స్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు 3 ART సెంటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మందులు వాడే విధంగా కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు.