KNR: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్సై పూదరి తిరుపతి గౌడ్ హెచ్చరించారు. ఇవాళ సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో అనవసరంగా గొడవలు పెట్టుకుని కేసులపాలు కావద్దని ఓటర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ బొజ్జరాజు పాల్గొన్నారు.