JGL: మెట్ పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో హోలియా దాసరి సంఘ సభ్యులను ఇవాళ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలుసుకొని వారి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, కాలనీలో మౌలిక వసతుల మెరుగుదల గురించి చర్చించారు. వారు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.