MNCL: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. సోమవారం మంచిర్యాల ఎస్సీ బాలుర కళాశాల, వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలని సూచించారు.