KNR: రెండు రోజుల విరామం అనంతరం ఇవాళ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్కు రైతులు 76 వాహనాల్లో 542 క్వింటాళ్ల విడి పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,250 కనిష్టంగా రూ. 6,200 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ. 50 పెరిగింది.