HYD: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్లో సైతం ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు తెలిపారు.