హైదరాబాద్ మహానగర పరిధి విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రతిష్ఠాత్మక ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు సంబంధించిన ఫైల్ గవర్నర్ ఆమోదంతో తిరిగి ప్రభుత్వానికి చేరుకుంది.