SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ముందుగానే అకౌంట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.