KKD: కిర్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయములకు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి డిప్యూటీ ఎంపీడీవోగా S.V.సుబ్బారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకు ముందు మండపేట మండలం ఇప్పనపాడులో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతిపై కిర్లంపూడికి వచ్చారు. ఆయన అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలతో అంకితభావంతో పనిచేస్తానన్నారు.