జెమిమా రోడ్రిగ్స్ వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై అజేయ సెంచరీతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ అనంతరం తన వాట్సాప్‌ను అన్ఇన్స్టాల్ చేసినట్లు జెమిమా తాజాగా వెల్లడించింది. ఆసీస్‌తో తను ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ వందల సంఖ్యలో మెసేజ్‌లు రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది.