HYD: పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.