TG: CM రేవంత్రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు. శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వెంటనే సమీక్షించి సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.