ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇవాళ పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద రూ. 18 లక్షలతో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల నాణ్యతను తనిఖీ చేసి, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, 36వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.