WGL: బలహీన వర్గాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ కడియం కావ్య పార్లమెంట్లో కేంద్రాన్ని కోరారు. వరంగల్లో నైపుణ్యా భివృద్ధి పథకాల అమలు, లోపాలపై ఆమె పార్లమెంట్లో ప్రశ్నించారు. పీఎంకేవీవై ప్రారంభం నుంచి ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అమలులో ఉన్న 4.0లో ఒక్క కేంద్రం కూడా పనిచేయకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.