W.G: ఆచంట మండలం వల్లూరు అగ్రికల్చర్ సొసైటీ వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ZPTC ఉప్పలపాటి సురేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత YCP పాలనలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే నరకయాతన పడేవారని, కనీసం రైతులకు బరకాలు సైతం అందించలేని స్థితికి దిగజారిందన్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.