SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల, నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణ తరగతుల్లో ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంపై పలు అంశాలు చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకులు సమష్టిగా పని చేసి పార్టీ విజయాన్ని సాధించాలన్నారు.