GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు, విన్నపాలను కార్యక్రమానికి హాజరైన నాయకులకు వివరించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ రావు (KK) ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.