సమంత, రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటి కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తున్నారు. అయితే, పూనమ్ కౌర్ మాత్రం ‘X’ వేదికగా సమంతపై పరోక్షంగా విమర్శలు చేసింది. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని కూల్చేయడం బాధాకరమని ఆమె పేర్కొంది. ‘బలహీనమైన పురుషులను డబ్బుతో తేలికగా కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను ఆమె PR టీమ్ గొప్పగా చూపించడం దారుణం’ అని పేర్కొంది.