BDK: మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోటేశ్వరరావు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి దశదిన కార్యక్రమానికి ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనోధైర్యం చెప్పారు. భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.