అన్నమయ్య: మదనపల్లి 1-టౌన్ పోలీసులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 48 లక్షలు మోసం చేసిన అంతర్జాతీయ సైబర్ ముఠాను సోమవారం అరెస్ట్ చేశారు. సీబీఐ/ఈడీ అధికారులమని నమ్మించి 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నారు. రాయచోటిలో పటాన్ ఇంథియాజ్ ఖాన్,షేక్ అమీన్, షేక్ అర్షాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి, రూ. 32 లక్షలు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.