కృష్ణా: కూటమి ప్రభుత్వ ఆదేశాలతో సొసైటీ ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నట్లు పీఏసీఎస్ ఛైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకావారిపాలెంలో రైతులకు టార్పాలిన్లు అందచేశారు. తుఫాన్ వాతావరణం నేపథ్యంలో రైతులకు పీఏసీఎస్ ద్వారా రొటేషన్ పద్ధతిలో టార్పాలిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సీఈవో కోరుకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.