కోనసీమ: అమలాపురం మండలం సచివాలయ ఉద్యోగుల విభాగం డిప్యూటీ ఎంపీడీవోగా గరిమెళ్ళ రవి ఇవాళ బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ ఉద్యోగుల పదోన్నతుల్లో భాగంగా అయినవిల్లి మండలం కొత్తరమూడిలో గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ రవి డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి పొందారు. ఆయన పదోన్నతిపతులను ఎంపీడీవో బాబ్జి రాజుకు అందజేసి విధుల్లో చేరారు. ఆయనను పలువురు అభినందించారు.